Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అధిష్ఠానం పిలిస్తే వెళతా: బొమ్మై

బెంగళూరు: బీజేపీ అధిష్ఠానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు దిల్లీ వెళతానని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై చెప్పారు. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ అనే విషయం అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టంచేశారు. కేంద్ర నాయకత్వం పిలిచిన వెంటనే కేబినెట్‌ విస్తరణపై చర్చించడానికి రాజధానికి వెళతానని బొమ్మై పునరుద్ఘాటించారు. గురువారం జరగాల్సిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం మే 11వ తేదీకి వాయిదా పడటంతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరింత గుప్పుమంటున్నాయి. మే 10వ తేదీకి ముందే కేబినెట్‌ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ‘మీరే వార్తలు, కథనాలు రాస్తారు. వాటిపై మమ్ములను వివరణ అడుగుతారు. దీనిపై నేనేం సమాధానం చెప్పాలి. అమిత్‌షా ఏమి చెబుతారో అదే నేను చెప్పగలను. దిల్లీలో కేంద్ర నాయకులతో అమిత్‌షా చర్చించి ఏ విషయం నాకు చెబుతానన్నారు. దిల్లీ నుంచి పిలుపుకోసం ఎదురుచూస్తున్నా’నని బొమ్మై అన్నారు. రాష్ట్ర నాయకత్వ మార్పుపైనా ఊహాగానాలు వచ్చాయి. దీనిపై అధికార బీజేపీ స్పందిస్తూ అలాంటిదేమీ ఉండదని స్పష్టం చేసింది. బీజేపీ అగ్ర నాయకులు సైతం ఆ వార్తలను కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img