Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇళ్ల సమస్యలపై నేటి నుంచి లబ్ధిదారులతో భేటీలు

. జగనన్న కాలనీ ఇళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలి
. టిడ్కో ఇళ్లు స్వాధీనం చేయాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: జగనన్న కాలనీలలో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున డబ్బు ఇవ్వాలని, టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి, తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17వ తేదీ మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి, అర్జీలపై సంతకాలు సేకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ…పేదల కోసం ఇళ్లస్థలాలు కేటాయించిన ప్రభుత్వం ఇళ్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత లబ్ధిదారులే గృహ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.80 ఇస్తోందని తెలిపారు. ఆయా స్థలాలలో వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో లబ్ధిదారుల పట్టాలను రద్దు చేస్తామని బెదిరిస్తోంది. ఒక కుటుంబానికి ఏమాత్రం నివాసయోగ్యం కాని విధంగా కేవలం సెంటు స్థలం కేటాయించారని, పట్టణాలకు, పని ప్రాంతాలకు సుదూరంగా కొండలు, గుట్టలు, చెరువులు, ముంపు ప్రాం తాలలో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో ఆయా ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు కేటాయించాలని సీపీఐ డిమాండ్‌ చేసినప్పటికీ జగన్‌ సర్కార్‌ పెడచెవిన పెట్టిందని విమర్శించారు. జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటివరకూ కల్పించలేదని, ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షా 80వేలు ఏమాత్రం సరిపోక లబ్ధిదారులు గందరగోళంలో ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన లక్షలాది టిడ్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనపరచకుండా జగన్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. గూడు సమకూరుతుందన్న ఆశతో అప్పులు తెచ్చి డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులు మూడున్నరేళ్లుగా టిడ్కో ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని తఏమాత్రం సరిపోక లబ్ధిదారులు గందరగోళంలో ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన లక్షలాది టిడ్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనపరచకుండా జగన్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. గూడు సమకూరుతుందన్న ఆశతో అప్పులు తెచ్చి డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులు మూడున్నరేళ్లుగా టిడ్కో ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల సమస్యపై 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని మండల, పట్టణ, నగరస్థాయిలలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి…సంతకాలు సేకరించాలని సూచించారు. సంతకాలతో కూడిన అర్జీలను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సమర్పించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.్థయిలలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి…సంతకాలు సేకరించాలని సూచించారు. సంతకాలతో కూడిన అర్జీలను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సమర్పించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img