Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉచిత రేషన్‌ కట్‌

కేంద్ర ఆహార, ప్రజాపంపిణి కార్యదర్శి వెల్లడి

న్యూదిల్లీ : కరోనాతో తలెత్తిన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేఏవై) కింద పంపిణీ చేసే ఉచిత రేషన్‌ వచ్చే నెల నుంచి అందదు. ఈనెల 30వ తేదీ తర్వాత ఉచిత రేషన్‌ ఇవ్వబోమని ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవా రం తెలిపారు. ఈ పథకాన్ని కొనసాగించే ప్రతిపా దన లేదన్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ ఏడాది నవంబర్‌ వరకు కొనసాగ నుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకో వడం, బహిరంగ మార్కెట్లో ఆహార ధాన్యాల వినియోగం, విక్రయాలు ఈ ఏడాది బాగానే ఉన్న నేపథ్యంలో పీఎంజీకేఏవైని పొడిగించే ప్రతిపాదన లేదని చెప్పారు. కోవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి నుంచి పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్‌ను పేదల కు అందిస్తున్నారు. 2020 ఏప్రిల్‌` జూన్‌ వరకు తొలుత దీనిని ప్రకటించిన ప్పటికీ ఆపై పరిస్థితుల దృష్ట్యా నవంబరు 30 వరకు పొడి గించారు. ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ (ఓఎంఎస్‌ ఎస్‌) మెరుగుగా ఉండటంతో ఉచిత రేషన్‌ అక్కర్లేదని విలేకరులతో మాట్లాడిన పాండే అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img