Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఒక్క రోజే కోటి డోసులు..నిజంగా అభినందనీయం

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే కోటి డోసులు వేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ భారత్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె భారత ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘వయోజన జనాభాలో 50 శాతం మందికి భారత్‌ కనీసం ఒక మోతాదు టీకా ఇచ్చింది. ఇప్పటివరకు మొత్తం 62 కోట్ల డోసులు ఇచ్చారు. అందులో శుక్రవారం కోటి డోసులు ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఈ ప్రచారంలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు అభినందనలు. టీకాతో కరోనా నుంచి ప్రజారోగ్యం, నివారణ పద్ధతులను అనుసరించడం ద్వారా మనమందరం సురక్షితంగా ఉందాం’ అని ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్‌ ద్వారా టీకా వేసిన వారందరికీ, టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక కోటి మార్కును దాటడం పెద్ద విజయమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img