Friday, April 26, 2024
Friday, April 26, 2024

చట్టసభ్యుల ‘ఆటోమేటిక్‌’ అనర్హతపై
సుప్రీంలో పిల్‌

న్యూదిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేళ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్‌గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్‌ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నించారు. దోషిగా తేలిన ప్రజాప్రతినిధిని ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. సంబంధిత సభ్యునిపై ఉన్న నేరాల స్వభావం, తీవ్రతతో సంబంధం లేకుండానే అనర్హతను అమలు చేయడం రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని వెల్లడిరచారు. ‘‘ఆటోమేటిక్‌’’ అనర్హత పై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. 2019 నాటి పరువు నష్టం వ్యవహారంలో రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చి సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో లోక్‌సభలో ఆయనపై అనర్హత వేటు పడిరది. ఇది జరిగిన మరుసటి రోజు సర్వోన్నత న్యాయస్థానంలో ‘ఆటోమేటిక్‌’ అనర్హతపై వ్యాజ్యం నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును పిటిషన్‌లో సవాల్‌ చేశారు. పార్లమెంటు సభ్యులంటే ప్రజల గొంతుక… ప్రజలు వారిని ఎన్నుకుంటారు కాబట్టి వారికి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌స్వేచ్ఛ ఉంటాయి’ అని పిటిషన్‌ పేర్కొంది. పార్లమెంటులోని ప్రతి ఒక్క సభ్యుడికి అధికరణ 19(1)(ఎ) కింద ఉండే హక్కుల కల్పననే పిటిషన్‌, పిటిషనర్‌ కోరింది. గతంలో ఇటువంటి సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు ముందు మూడు నెలల సమయం ఉండేది. ఆలోపు పై కోర్టులలో అప్పీలు చేసుకొనే వెసులుబాటు సంబంధిత సభ్యులకు ఉండేది. న్యాయపరంగా తమకున్న అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వేటు పడేది కాదు. ఈ నిబంధనపై గతంలో లిల్లీ థామస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు నడిరచింది. అయితే ఈ నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దోషులుగా తేలిన వెంటనే ఆయా ప్రజాప్రతినిధులు అనర్హులుగా పరిగణించాలని తేల్చిచెప్పింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో సవరణలు జరిగాయి. వాటి ఆధారంగానే రాహుల్‌పై వేటు పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img