Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 9,216 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొంతకాలంగా పదివేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.్ల: దేశంలో కొత్తగా 9,216 కరోనా కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు కొద్దిగా తగ్గాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,976 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,70,115 మంది మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 391 మంది కరోనాకు బలవగా, 8612 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్నటివరకు 125 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడిరచింది. 46.3 కోట్ల మందికి పైగా రెండు డోసులు వేయించుకోగా 79.3 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు. నిన్న 73.67 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మరో వైపు రోజువారీ కరోనా కేసుల గణాంకాలన్నీ ఊరటనిస్తున్నా..దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఇద్దరిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img