Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోంది. గత మూడు రోజులుగా కొవిడ్‌ కాస్త తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 871 మంది మృతి చెందారు. 3,35,939 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,04,333గా ఉంది. కోవిడ్‌ రోజువారి పాజిటివిటి రేటు 13.39 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రికవరీలు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు తగ్గుతున్నాయి. నిన్న 3,35,939 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.89 శాతానికి చేరింది. ఇక నిన్న 56 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 1,65,04,87,260కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img