Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

నామినేషన్ల కోలాహలం

. మొదటి రోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు
. భారీ ప్రదర్శనలతో సందడి చేసిన అభ్యర్థులు
. తొలి నామినేషన్‌ పయ్యావులదే

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజే అభ్యర్థులు భారీ ప్రదర్శనలతో నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల సందడి నెలకొంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని అట్టహాసంగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు స్వీకరించారు. రాష్ట్రంలో తొలి నామినేషన్‌ ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ దాఖలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ తరపున నామినేషన్‌ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్‌ నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు కలిసి రాగా నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2:34 గంటలకు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ కూడా ర్యాలీగా తరలివెళ్లి మంగళగిరి అసెంబ్లీకి నామినేషన్‌ వేశారు. ఒంగోలు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి (టీడీపీ), బుట్టా రేణుక (వైసీపీ), శ్రీశైలం అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి (వైసీపీ), శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (టీడీపీ), ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ పత్రాలను ఆర్వోకి సమర్పించారు. నూజివీడులో టీడీపీ రెబల్‌ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా టీడీపీ రెబల్‌ రాజేశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రామచంద్రాపురం ఆర్డీఒ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాశ్‌ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తరపున వైసీపీ నేతలు ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పుట్టపర్తి కలెక్టర్‌ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలైంది. రాజంపేటంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్‌ రెడ్డి అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. సూళ్లూరుపేట రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, తిరువూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు భారీ ప్రదర్శనతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్‌ దాఖలు చేశారు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. మైదుకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి, తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమన అభినయ్‌ రెడ్డి, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, చిత్తూరులో ఎంసీ విజయానందరెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి భారీ ప్రదర్శనలతో అట్టహాసంగా నామినేషన్‌లు దాఖలు చేశారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌, భీమునిపట్నం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img