Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పెద్ద నోట్ల రద్దుపై రాజ్యాంగ ధర్మాసనంలో ఈరోజు తీర్పు వచ్చింది. నోట్ల రద్దును సుప్రీంకోర్టు సమర్ధించింది. నోట్ల రద్దును నలుగురు సభ్యులు సమర్థించారు. దామాషా ప్రకారం నోట్ల రద్దును కొట్టివేయలేమని ధర్మాసనం తెలిపింది. 58 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500లు, రూ.1000ల నోట్లను రద్దు చేసింది. 2016 నవంబర్‌ 8న ఇచ్చిన నోటిఫికేషన్‌ సరైనదేనని న్యాయస్థానం తెలిపింది. ఆర్బీఐ అభిప్రాయం తీసుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. నోట్ల రద్దు ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర నిర్ణయాలను తోసిపుచ్చలేమని తెలిపింది. అయితే జస్టిస్‌ గవాయ్‌ తీర్పుతో జస్టిస్‌ బీవీ నాగరత్న విభేదించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టరూపంలో లేదా ఆర్డినెన్స్‌ రూపంలో చేస్తే బాగుండేదని జస్టిస్‌ నాగరత్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img