Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య తీవ్రస్థాయిలో వైరస్‌ వ్యాప్తి : ఐఐటీ మద్రాస్‌

దేశంలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టును ఐఐటీ మద్రాస్‌ ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని ఐఐటీ మద్రాస్‌ విశ్లేషకులు హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌లో ఆర్‌నాట్‌ వాల్యూ ఈ వారం 4కు చేరుకున్నదని హెచ్చరించారు. దాని ఆధారంగా ఫిబ్రవరి తొలి రెండు వారాల్లో అధికస్థాయిలో కేసులు నమోదవుతాయని తెలిపారు. ఆర్‌ నాట్‌ లేదా ఆర్‌ఓ..ద్వారా ఒక్కరి నుంచి ఎంతమందికి వైరస్‌ సోకుతుందో తెలిసిపోతుంది. అయితే ఆర్‌ వాల్యూ ఒకటి కన్నా తక్కువగా ఉంటే అప్పుడు కరోనా అయినట్లు లెక్క. ఐఐటీ మద్రాస్‌ చేపట్టిన కంప్యూటేషన్‌ మోడలింగ్‌ విధానం ఆధారంగా, గత వారం దేశంలో ఆర్‌ఓ వాల్యూ 2.9గా ఉందన్నారు. ప్రస్తుతం జనవరి ఒకటి నుంచి 6వ తేదీ మధ్య ఆ వాల్యూ 4కు చేరినట్లు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img