Friday, April 26, 2024
Friday, April 26, 2024

బంగారం, వెండి ధరలకు రెక్కలు

న్యూదిల్లీ: బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం దేశరాజధానిలో రూ.1,298 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.53,784కు చేరుకోగా, దీన్ని అనుసరిస్తూనే వెండి ధరలు పెరిగాయని, రూపాయి 84 పైసలు నష్టపోయిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అంతకుముందు 10 గ్రాముల బంగారం రూ.52,486 ఉండగా, వెండి రూ.1,910 పెరిగి రూ.70,977కు చేరుకుంది. అంతకుముందు రూ.69,067గా నమోదైంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 84 పైసలు తగ్గింది. రష్యా`ఉక్రెయిన్‌ మధ్య యుద్ధమే దీనికి కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img