Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మాండూస్‌ తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాండూస్‌ తుఫానుగా మారుతోంది. దీంతో భారత వాతావరణశాఖ గురువారం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున 3:12 గంటలకు ట్వీట్‌ చేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దాని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో గంటకు 65.75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే రెండు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. కోస్తాంధ్ర, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img