Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బెంగళూరును వణికిస్తున్న వర్షం,,పదేళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షపాతం

మరోసారి బెంగళూరు నగరాన్ని వర్షం వణికిస్తోంది. వరద కష్టాలు నగరవాసుల్ని వీడటం లేదు. పదేళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. 2017లో 1696 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 1802 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. నవంబరు వరకు వరద కష్టాలు తప్పవని, వాతావరణ మార్పులే దీనికి కారణమని పేర్కొన్నారు. సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరులో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. కానీ, ఈఏడాది మే నుంచి వరుణుడు పగబట్టినట్టు ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి.వానలకు నగరం అతలాకుతలమవుతోంది. చినుకుపడితే నగరవాసి భయంతో వణికిపోతున్నాడు. గత నెల బెంగళూరు దక్షిణ- తూర్పు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. తాజా, బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు బెల్లందూర్‌ ఐటీ జోన్‌ సహ పాత బెంగళూరు పరిధిలోని సిటీ మార్కెట్‌ చుట్టు పక్కల ఉన్న సుల్తాన్‌పేట, బీవీకే అయ్యంగార్‌ రోడ్డు, బాళేపేట, చిక్కపేట అల్లాడిపోయింది. రోడ్లపై మోకాలు లోతు నీరు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. వాన నీటికి వ్యాపారుల కష్టాలు వర్ణనాతీతం. వర్షం నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వ్యాపారులు మండిపడుతున్నారు. ఆ పేటల నుంచి వాననీటి రాజకాలువ సిటీ మార్కెట్‌ మీదగా కోరమంగల వరకు ప్రవహిస్తుంది. కాలువమీదనే స్లాబ్‌ వేయడంతో ప్రవాహం మందగించి.. రహదారులపైకి నీరు చేరుతోంది. వానొచ్చిన ప్రతిసారీ పాత బెంగళూరు ప్రాంతాల్లో జనం భయపడుతున్నారు. దారులన్నీ పూర్తిగా బురద మాయం కావడమే అందుకు కారణం. రోజూ సాయంత్రం మొదలవుతున్న వాన.. తెల్లవారు జాము వరకు వదలడం లేదు. కాగా, బుధవారం రాత్రి అత్యధికంగా రాజామహల్‌ గుత్తనహళ్లిలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ఐఎండీ తెలిపింది. ఎల్లో అలెర్ట్‌ జారీచేసిన ఐఎండీ.. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షం నీటితో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్స్‌, సెల్లార్లలోని వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. మెజిస్టిక్‌ సమీపంలో గోడకూలిపోయి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img