Friday, April 26, 2024
Friday, April 26, 2024

మస్క్‌ చేతికి ట్విట్టర్‌ వెళితే.. ఉద్యోగుల పని ‘గోవిందా’

75 శాతం మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలో మస్క్‌
ప్రత్యేక కథనంలో పేర్కొన్న వాషింగ్టన్‌ పోస్ట్‌

ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. ట్విట్టర్‌ విలువపై కంపెనీ యాజమాన్యం, మస్క్‌ మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలోకి వెళ్లడం తెలిసిందే. అయినా, ఇప్పటికీ తాను ట్విట్టర్‌ను మొదట పేర్కొన్న విలువకే కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు ఇటీవల మస్క్‌ ప్రకటన చేశారు. ఈ క్రమంలో మస్క్‌ చేతికి ట్విట్టర్‌ వెళితే కనుక.. ట్విట్టర్‌ లోని 75 శాతం మంది ఉద్యోగులు తొలగింపునకు గురవుతారని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 75 శాతం మందిని తొలగించే ప్రణాళికతో మస్క్‌ ఉన్నారన్నది ఈ కథనంలోని ప్రధాన అంశం. కొన్ని డాక్యుమెంట్లతోపాటు, ట్విట్టర్‌ డీల్‌ పై చర్చల వ్యవహారం తెలిసిన వర్గాల ఆధారంగా వాషింగ్టన్‌ పోస్ట్‌ దీన్ని ప్రచురించింది. ఒకేసారి అంతమందిని తొలగిస్తే పెద్ద రిస్క్‌ వచ్చి పడుతుందని, హానికారక కంటెంట్‌, స్పామ్‌ ట్విట్టర్‌ ప్లాట్‌ ఫామ్‌ ను ఆక్రమిస్తాయని సందేహం వ్యక్తం చేసింది. తాను ట్విట్టర్‌ ను కొనుగోలు చేస్తే స్పామ్‌ బాట్‌ అకౌంట్లను తొలగిస్తానని మస్క్‌ సైతం ప్రకటించారు. మరోవైపు ఆర్థిక మందగమనం వల్ల నియామకాలను తగ్గించినట్టు ట్విట్టర్‌ జూన్‌ లోనే ఓ ప్రకటన చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img