Friday, April 26, 2024
Friday, April 26, 2024

మితిమీరుతున్న యాంటీబయాటిక్స్‌ వాడకం..

ఇష్టానుసారం వాడితే అనర్థాలే.. ఐసీఎంఆర్‌ హెచ్చరిక
ఇటీవలి కాలంలో యాంటీబయాటిక్స్‌ వాడకం విపరీతంగా పెరిగింది. అయినదానికి, కానిదానికి వాటిని విపరీతంగా వాడేస్తున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యుడిని సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్‌ మింగేస్తున్నారు. అయితే, ఇలా ఇష్టానుసారం వీటిని వాడడం అంత మంచిది కాదని, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) హెచ్చరించింది. జ్వరం 100.4 నుంచి 102.2 డిగ్రీలలోపు (లో గ్రేడ్‌ ఫీవర్‌) ఉంటే వాటిని వాడొద్దని సూచించింది. దగ్గు, శ్లేష్మం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, కొద్దిపాటి జ్వరం వంటి బ్రాంకైటిస్‌ లక్షణాలకు కూడా యాంటీబయాటిక్స్‌ వాడకంలో జాగ్రత్త వహించాలని పేర్కొంది. ఇలాంటి కేసులకు యాంటీబయాటిక్స్‌ సూచించే విషయంలో వైద్యులు కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని తెలిపింది. ఒకవేళ వాటిని ఇవ్వాలనుకుంటే కనుక పేషెంట్‌ హిస్టరీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. న్యుమోనియాకు ఐదు రోజులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా న్యుమోనియా బారినపడితే 8 రోజులపాటు యాంటీబయాటిక్స్‌ వాడితే సరిపోతుందని పేర్కొంది. యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం వాడుతుండడం వలన అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదన్న వార్తలు వస్తుండడంతో ఐసీఎంఆర్‌ సర్వే నిర్వహించింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేస్తూ ఈ హెచ్చరికలు జారీ చేసింది. శక్తిమంతమైన యాంటీబయాటిక్‌గా పేరు తెచ్చుకున్న కార్బపినమ్‌ ఇచ్చినా ఎలాంటి ఫలితం ఉండడం లేదన్న విషయం సర్వేలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img