Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మొత్తం నగరాన్ని ఊపిరి ఆడకుండా చేశారు

రైతులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సత్యాగ్రహం నిర్వహించేందుకు కిసాన్‌ మహా పంచాయత్‌ అనుమతి ఇవ్వాలన్న రైతుసంఘం అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘మీరు మొత్తం నగరాన్ని ఊపిరి ఆడకుండా చేశారు. ఇప్పుడు మీరు నగరంలోకి రావాలనుకుంటున్నారు. నగరవాసులు ఈ నిరసనతో సంతోషంగా ఉన్నారా? ఇటువంటి పనిని ఆపాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కిసాన్‌ మహాపంచాయత్‌ సంఘం దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కనీసం 200 మంది రైతులు/నిరసనకారులు సత్యాగ్రహం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, అందుకు తగిన స్థలాన్ని కేటాయించే విధంగా అధికారులను ఆదేశించాలని కిసాన్‌ మహా పంచాయత్‌ సుప్రీంకోర్టును కోరింది. ఈ సత్యాగ్రహాన్ని శాంతియుతంగా, అహింసాయుతంగా నిర్వహిస్తామని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనపై జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, సిటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ‘‘మీకు కోర్టుల మీద నమ్మకం ఉంటే, నిరసనలు తెలపడానికి బదులుగా అత్యవసర విచారణ జరపాలని కోరండి. మీరు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా నిరసన తెలుపుతున్నారా?’’ అని ప్రశ్నించింది.రైతులు హైవేలను దిగ్బంధనం చేస్తూ, నిరసన శాంతియుతమని చెప్తున్నారని పేర్కొంది. ప్రజలకు కూడా సంచరించే హక్కులు ఉన్నాయని పేర్కొంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా న్యాయవ్యవస్థను ఆశ్రయించినప్పుడు ఈ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సూచించింది. అయితే తాము హైవేలను దిగ్బంధనం చేయలేదని, పోలీసులు తమను అక్కడ నిర్బంధించారని రైతు సంఘం తరపు న్యాయవాది చెప్పారు.దీంతో ధర్మాసనం స్పందిస్తూ, దిల్లీ సరిహద్దులో జరుగుతోన్న రైతు ఉద్యమంలో తాము భాగం కాదంటూ అఫిడవిట్‌ దాఖలు చేయండని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img