Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోదీ-యోగి సర్కార్లపై సోనియా ఫైర్‌

రాయ్‌బరేలి(యూపీ): కేంద్రంలో మోదీ సర్కారు, యూపీలో యోగి సర్కార్ల వైఫల్యాలను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎండగట్టారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగోవిడత పోలింగ్‌కు చివరి రోజైన సోమవారం జరిగిన వర్చువల్‌ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మోదీ హయాంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. విభజన సృష్టించడం తప్ప చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 12 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా… వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పెట్రోల్‌-డీజిల్‌, ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలకు ఇల్లు గడవడమే కష్టంగా మారిందన్నారు. ఇక యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించలేదన్నారు. కాంగ్రెస్‌ చేసిన అన్ని ప్రయత్నాలను కరోనా సమయంలో బీజేపీ అడ్డుకుందన్నారు. రాయ్‌బరేలీ ప్రజల పట్ల మోదీ సర్కారు ‘సవతి తల్లి’గా వ్యవహరించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు, చిరు వ్యాపారులు.. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వందలాది కిలోమీటర్లు కాలి నడకన నడవాల్సిన ఆందోళనకర దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మండిపడ్డారు. వేలాదిమంది వలస కార్మికులు బాధలను పట్టించుకోవడంలో కేంద్రంలో ప్రధాని మోదీ- రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి విఫలం అయ్యారని విమర్శలు గుప్పించారు. ఎలాంటి ఆర్థిక సహకారాన్ని అందించలేకపోయాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ హక్కుల కోసం పోరాడిన 18 వేల మంది కార్మికులను జైలుకు పంపారని సోనియా విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు దేశ మార్పు, అభివృద్ధికి కాంగ్రెస్‌ ఎన్నో పనులు చేసిందని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడమే మా ఉద్దేశమని అన్నారు. యూపీలో ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను విశ్వసిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
రేపు నాలుగో దశ పోలింగ్‌
ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఇక నాలుగు విడతల పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 స్థానాలకు ఫిబ్రవరి 23న పోలింగ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img