Friday, April 26, 2024
Friday, April 26, 2024

గర్జించిన ఉపాధిహామీ కూలీలు

కొత్తపట్నం, క్రిష్టిపాడుల్లో ధర్నా
గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం తూట్లు
కేంద్ర బడ్జెట్‌లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించాలి : విల్సన్‌ డిమాండ్‌
పని దినాలు 200 రోజులకు పెంచాలి : ఆవుల శేఖర్‌

విశాలాంధ్ర`ఒంగోలు బ్యూరో/యాడికి:
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తోందని ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడు సచివాలయం వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. కొత్తపట్నంలో జరిగిన కార్యక్రమానికి జల్లి విల్సన్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విల్సన్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆ పథకానికి సరిపడా నిధులు కేటాయించక పోవటం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చి, ఒక పూట మాత్రమే పనిచేసే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కనీస పని దినాలు 200 రోజులు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు లేక వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం కూడా పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఆసరాలా ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసేంతవరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన ఆందోళన అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల డబ్బులు మాత్రం సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం చేశారు. ఇప్పటికైనా పెండిరగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కొత్తపట్నం పంచాయతీ సచివాలయం దగ్గర్నుండి సీపీఐ జిల్లా కార్యాలయ వరకు వ్యవసాయ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ రామకృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి గోపి, కొత్తపట్నం గ్రామ సర్పంచ్‌ వెంకట శ్రావణి, సీపీిఐ జిల్లా సమితి సభ్యులు విజయ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో : ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌ లో రూ.2.40 కోట్ల రూపాయలు కేటాయించాలని ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడు గ్రామ సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ జాబ్‌ కార్డు లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజులు చొప్పున పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని అన్నారు. పట్టణ ప్రజలకు ఉపాధి హామీ వర్తింపజేయాలి అన్నారు. కూలీల వాటాను 90 శాతానికి పెంచి మెటీరియల్‌ కాంపోనెంట్‌ పది శాతానికి తగ్గించాలని అన్నారు. ఉపాధి హామీలో యంత్రాలను కాంట్రాక్టర్‌లను నిషేధించాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంచాయితీ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య, ఉపాధ్యక్షుడు వెంకట రాముడు యాదవ్‌, సీపీిఐ నాయకులు కృష్ణ, నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నారాయణస్వామి, రైతు సంఘం నాయకులు ఆదినారాయణ యాదవ్‌, రంగస్వామి, సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి సూర్యనారాయణ, కండ్ల గూడూరు ఈశ్వర్‌ ఆచారి, నాయకులు మద్దిలేటి, మల్లికార్జున, పెద్దయ్య, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img