Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజధాని కేసులు త్వరగా విచారించండి

సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
రాజధాని కేసులు తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోని అడ్వకేట్‌ ఆన్‌రికార్డ్స్‌ మెహఫూజ్‌ నజ్కీ ఈనెల 6న మెన్షన్‌ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రార్‌ను అభ్యర్థించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్‌ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడిరది. అయితే 31న బెంచ్‌ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ఈనెల 6న మెన్షన్‌ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని రిజిస్ట్రారును ప్రభుత్వ న్యాయవాది కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img