Friday, April 26, 2024
Friday, April 26, 2024

శ్రీలంకలో వారంపాటు స్కూళ్లు బంద్‌

కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. అన్ని వస్తువుల కొరత నెలకొంది. ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో విద్యాసంస్థలకు జులై 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు సెలవులను శ్రీలంక విద్యాశాఖ ప్రకటించింది. బడులు తెరుచుకున్న తర్వాత సిలబస్‌ను పూర్తి చేస్తారని తెలిపింది. జూన్‌ 18న కూడా అన్ని పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేయడం విదితమే. కొలంబో నగర పరిధిలోని అన్ని ప్రభుత్వం, ప్రభుత్వ అనుబంధ ప్రైవేటు పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేయాలని విద్యుత్‌, ఇంధన కొరతే కారణమని విద్యాశాఖ వెల్లడిరచినట్లు డైలీ మిర్రర్‌ పేర్కొంది. విద్యాశాఖ కార్యదర్శి నిహాల్‌ రణసింఘె ఇదే విషయమై స్పందిస్తూ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని స్కూళ్లకు సూచించినట్లు తెలిపారు. రవాణా కష్టాలు లేకపోతేగనుక టీచర్లు, విద్యార్థులు, ప్రిన్సిపాల్‌పై సంక్షోభ ప్రభావం లేనిపరిస్థితుల్లో తక్కువ మంది విద్యార్థులతో తరగతులను నిర్వహించవచ్చు అని జిల్లా స్థాయి స్కూళ్లకు సంబందించి రణసింఘె వెల్లడిరచారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ కోతలు ఉండరాదని, తద్వారా ఆన్‌లైన్‌ బోధనకు వారంతాల్లో అవకాశం ఉంటుందని పబ్లిక్‌ యుటిలిటీస్‌ కమిషన్‌, శ్రీలంక (పీయూసీఎస్‌ఎల్‌) నిర్ణయించినట్లు డైలీ మిర్రర్‌ నివేదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img