Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్వయం సమృద్ధిగా మారాలి

ప్రజలు స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ప్రధాని నరేంద్ర మోదీ

అహ్మదాబాద్‌ : ఈ తరుణంలో భారతదేశం స్తబ్దుగా ఉండలేకపోతోందని, స్వయం సమృద్ధిగా మారాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానికంగా తయారైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న 25 ఏళ్ల పాటు ప్రజలు స్థానిక వస్తువులను వినియోగిస్తే దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. శనివారం హనుమాన్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని వీడియో లింక్‌ ద్వారా ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ‘భారతదేశం నేడు స్తబ్దుగా ఉండలేకపోతోంది. మనం మెలకువగా ఉన్నా లేదా నిద్రపోతున్నా, మనం ఉన్న చోటనే ఉండలేం. ప్రపంచం మొత్తం ‘ఆత్మనిర్భర్‌’ (స్వయం సమృద్ధిగా) ఎలా మారాలి అని ఆలోచిస్తున్నట్లుగా ప్రపంచ పరిస్థితి ఉంది’ అని తెలిపారు. ‘స్థానిక ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయమని ప్రజలకు నేర్పించమని దేశానికి చెందిన సాధువులను అభ్యర్థిస్తున్నాను. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అనేది విషయం. మన ఇళ్లలో మన వారు తయారు చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. దీని వల్ల ఉపాధి పొందే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకోండి’ అని అన్నారు. విదేశీ తయారీ వస్తువులను మనం ఇష్టపడవచ్చు. కానీ ఈ వస్తువులు మన ప్రజల కష్టార్జిత అనుభూతిని, మన మాతృభూమి పరిమళాన్ని కలిగి ఉండవు’ అని మోదీ పేర్కొన్నారు. ‘రాబోయే 25 సంవత్సరాలలో మనం కేవలం స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను ఉపయోగిస్తే, మన ప్రజలకు నిరుద్యోగం ఉండదు’ అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలను ఒకే స్ఫూర్తితో అనుసంధానించారని, దేశానికి స్వాతంత్య్ర సాధన కోసం సంకల్పం సాధించడంలో సహాయపడిరదని మోదీ అన్నారు. విగ్రహం ఏర్పాటయిన ఖోఖ్రా హనుమాన్‌ ధామ్‌తో తనకున్న గత సంబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. 1979 ప్రాంతంలో జరిగిన మచ్చు డ్యామ్‌ దుర్ఘటనను గుర్తుచేసుకుంటూ, ఆ విపత్తు నుంచి నేర్చుకున్న పాఠాలు 2001 భుజ్‌ భూకంపాన్ని ఎదుర్కోవడానికి సహాయపడ్డాయని చెప్పారు. కచ్‌లోని పర్యాటక అభివృద్ధి నుంచి కూడా మోర్బి ప్రయోజనం పొందిందని, గిర్నార్‌ వద్ద రోప్‌వే వంటి ఇతర పర్యాటక ఆకర్షణలను ప్రస్తావిస్తూ, ప్రజలు కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవడానికి ఇది సహాయపడిరదని అన్నారు. ‘భారతదేశం అంతర్లీన బలం ఏమిటంటే, ఎక్కువ ఏమీ చేయకుండానే టూరిజం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img