Monday, March 20, 2023
Monday, March 20, 2023

2 కోట్ల ఉద్యోగాల హామీ విఫలం : కాంగ్రెస్‌

న్యూదిల్లీ : ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు బుధవారం జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పిందని, ఇప్పటికీ 15 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండవలసిందని చెప్పారు. వాస్తవంగా నేటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రానున్న ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం సమస్య తీవ్రంగా ఉందన్నారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడులు రాకపోవడం, ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశం ఒకటి అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2047 నాటికి అద్భుతమైన, ఆధునిక, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కోసం ప్రజలు గట్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2047లో భారతదేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటుందన్నారు. మనం గట్టిగా శ్రమించి కృషి చేయాలని, తద్వారా సత్ఫలితాలు వచ్చేలా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ ప్రస్థానంలో మనందరికీ సమాన భాగస్వామ్యం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img