Friday, September 30, 2022
Friday, September 30, 2022

20 వేల దిగువకు కరోనా కేసులు..

209 రోజుల్లో ఇదే తొలిసారి…

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,346 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్త కేసులు ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే ఇదే మరణాలు పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 263 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో సగానికి పైగా మరణాలు ఒక్క కేరళలోనే నమోదవ్వడం గమనార్హం. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,52,902 ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 97.93గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img