Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అమరావతిపై చంద్రబాబు కీలక ప్రకటన

కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో సమావేశం అయ్యారు. తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల ఎన్డీఏ కూటమి శాసన సభా పక్ష సమావేశంలో.. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలియజేశారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం పలుకుతారు.. చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఎన్డీఏ శాసనసభాపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిపై ఉందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని.. నూటికి నూరు శాతం తెలుగు దేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని.. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు చరిత్రలో గొప్ప విజయాన్ని అందించారన్నారు.పవన్‌ కల్యాణ్‌ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనని.. తాను జైలులో ఉన్నప్పుడు పవన్‌ వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారని.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశామన్నారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి కక్షసాధింపులు లేకుండా.. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోక తప్పదన్నారు.

చంద్రబాబు అమరావతిపై కీలక ప్రకటన చేశారు.. ఇకపై మూడు రాజధానులు ఉండవని.. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అన్నారు. విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు.. విశాఖ ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీని నాలుగు సీట్లలో గెలిపించారన్నారు. అలాగే కర్నూలు ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాయలసీమలో కూడా ప్రజలు కూటమిని ఆశీర్వదించారని.. మంచి మెజార్టీలు ఇచ్చారన్నారు. రాబోయే అన్ని రోజుల్లో అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఉంటుందని.. రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తామన్నారు. ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల కోసమే ఉంటుంది.. పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు.

ఏపీ ఎన్నికల్లో కూటమి అద్భుత మెజార్టీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి 21 లోక్‌సభ స్థానాలను దక్కించుకుందని.. కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించామని.. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని హితవు పలికారు. ఐదు కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని.. అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని పవన్ ఆకాంక్షించారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో.. ఈ ఐదేళ్లలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదర్కొన్నామని.. ఐదేళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. ఐదేళ్లలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారని.. కూటమి అధికారంలోకి వస్తుందనే భావన అందరిలో ఉంది అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img