Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కక్ష సాధింపు

గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్‌
2 వేలమంది ప్రొబేషన్‌ నిలిపివేత

అన్ని అర్హతలున్నా తొక్కిపట్టిన వైనం
జగన్‌ సర్కార్‌ చర్యలపై తీవ్ర విమర్శలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: తమ హక్కుల కోసం ఉద్యమించిన గ్రామ/వార్డు సచివాలయాలకు చెందిన 2వేల మంది ఉద్యోగుల ప్రొబేషన్‌ను ప్రభుత్వం తొక్కిపట్టిందన్న ప్రచారం…తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకుని, శాఖాపరమైన పరీక్షల్లో నెగ్గి, ప్రొబేషన్‌కు అన్ని అర్హతలున్నప్పటికీ, జిల్లా కలెక్టర్లు వారికి ఉత్తర్వులు ఇవ్వడం లేదని సమాచారం. శాఖా పరమైన పరీక్షల్లో అర్హత సాధించిన అందర్నీ ప్రొబేషన్‌కు అర్హులుగా గుర్తించి, కేవలం ప్రభుత్వంపై నిరసనకు దిగారనే సాకుతో పక్కన పెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జిల్లా కలెక్టర్లు ప్రొబేషన్‌ ఉత్తర్వులు ఇవ్వకపోడంతో, వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, లక్షా 34వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. రెండేళ్ల ప్రొబేషన్‌ తర్వాత, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సర్వీసు రెండేళ్లు పూర్తయ్యే దశలో శాఖా పరమైన పరీక్షల్లో నెగ్గిన వారికే ప్రొబేషన్‌ అర్హత ఉంటుందని ప్రభుత్వం మెలిక పెట్టింది. రెండేళ్ల తర్వాత కొంత మంది సచివాలయ ఉద్యోగులకు ఇతర విభాగాల్లో ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. అప్పటికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో లక్షా 21వేల మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ నిబంధనల ఆధారంగా, ఏపీపీఎస్సీ నిర్వహించిన శాఖా పరమైన పరీక్షల్లో అర్హత సాధించిన లక్షా 5వేల మందికి తాజాగా ప్రొబేషన్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో 90వేల మందికి జులైకి నూతన వేతనాలు అందగా, 2వేల మందికి మాత్రం ప్రొబేషన్‌ ఖరారు చేయలేదు. వారిలో అధికంగా కడప, కర్నూలు, కృష్ణా జిల్లాలకు చెందిన ఉద్యోగులే ఉన్నారు.
కలెక్టర్ల దగ్గర దస్త్రాలు
ప్రొబేషన్‌ నిలిచిన ఉద్యోగుల దస్త్రాలు కలెక్టర్ల దగ్గర మూలుగుతున్నాయి. 2019 అక్టోబరులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. 2021అక్టోబరు నాటికి ఉద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తయింది. అప్పటివరకు 50వేల మంది ఏపీపీఎస్సీ నిర్వహించిన శాఖా పరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయంలో వారికి ప్రొబేషన్‌ను ప్రభుత్వం ఖరారు చేస్తే, గత నవంబరు నుంచి నూతన వేతనాలు అందుకునే వారు. దానిపై ప్రభుత్వం జాప్యాన్ని నిరసిస్తూ, జనవరిలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించగా, మరికొందరు విధులు బహిష్కరించారు. ఆందోళనకు దిగిన ఉద్యోగుల పేర్లు కృష్ణా, కర్నూలు, కడప తదితర జిల్లా కలెక్టర్లకు చేరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారనే సాకుతో వారిని పక్కన పెట్టినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు రూ.15వేల చొప్పున గౌరవ వేతనం పొందుతున్నారు. వాటి స్థానంలో పే స్కేల్‌తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి పొందు పరచాల్సి ఉంది. దానిపైనా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
పోలీసులతో అణచివేత
జగన్‌ ప్రభుత్వం మొదటి నుంచీ ఉద్యమిస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలపై పోలీసులతో అణచివేత చర్యలకు పాల్పడుతోందంటూ ఉద్యోగ సంఘాలు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img