Friday, August 12, 2022
Friday, August 12, 2022

మిత్రులు సంపన్నులు…యువకులు అగ్నివీరులా?

న్యూదిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన మిత్రులను సంపన్నులుగానూ, యువతను అగ్నివీరులుగానూ మారుస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఘాటుగా విమర్శించారు. తన సంపన్న మిత్రులకు 50 ఏళ్లకు విమానాశ్రయాలు అప్పగిస్తున్న మోదీ…యువతకు మాత్రం నాలుగేళ్ల అగ్నివీరులను చేస్తున్నారని మండిపడ్డారు. నూతన సైనిక నియామక పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతియుత సత్యాగ్రహం చేసిన మరుసటి రోజు రాహుల్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువతకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా సత్యాహ్రాలు చేస్తోందని, యువతకు న్యాయం జరిగేంత వరకూ ఈ సత్యాగ్రహాలు ఆపేది లేదని రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టంచేశారు. (Story: మిత్రులు సంపన్నులు…యువకులు అగ్నివీరులా?)

See Also:

ఇది సిద్ధాంతాల మధ్య పోరు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img