Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటి నుంచి టెట్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీటెట్‌)2022 పరీక్షలను ఆగస్టు 6 నుంచి 21 వరకు ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్లో మొత్తంగా 22 సెషన్లు, రోజూ రెండు విడతలుగా నిర్వహిస్తారు. నూతన విద్యా విధానంలో భాగంగా, ఏర్పాటు చేసిన తరగతులకు అనుగుణంగా టెట్‌ పేపర్లను పెంచారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్జీటీ) సెషన్లు ఉన్నాయి. జూన్‌ 6న టెట్‌ ప్రకటన జారీ చేసి, 15 నుంచి జులై 15 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మూడేళ్ల తర్వాత టెట్‌ నిర్వహించడం, విద్యార్హత పరీక్షా శాతంలో సడలింపు ఇవ్వడంతో దాదాపు 5.50లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈనెల 6న పేపర్‌2(ఏ) సెషన్‌1, 2ను రెండు విడతలుగా మ్యాథ్స్‌, సైన్స్‌ పేపర్‌ నిర్వహిస్తారు. 7న లాంగ్వేజెస్‌ పేపర్‌ 2(ఏ) 3, 4 సెషన్లు, 9వ తేదీన సెషన్‌5 పేపర్‌2(ఏ) మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌, సెషన్‌6 పేపర్‌2(ఏ) లాంగ్వేజెస్‌ పేపర్లు నిర్వహిస్తారు. 11న సెషన్‌7 పేపర్‌ 1(బి) 1 నుంచి 5 తరగతులకు, సెషన్‌8 (6 నుంచి 8 తరగతులకు) ఏర్పాటు చేశారు. 12న సెషన్‌ 9 కింద పేపర్‌2(ఏ) సోషల్‌ స్టడీస్‌, సెషన్‌ 10 సోషల్‌ స్టడీస్‌ 2(ఏ) పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 12 నుంచి 21వరకు (సెషన్‌ 11 నుంచి సెషన్‌ 22 వరకు) ఎస్జీటీ పరీక్షలను వరుస వారీగా నిర్వహిస్తారు. ఈ పరీక్షల హాల్‌ టికెట్లను నెట్‌లో అందుబాటులో ఉంచారు.
ఇంతవరకు నిర్వహించిన టెట్‌ పరీక్షలను ఎక్కడికక్కడే అభ్యర్థులకు సొంత జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలను విద్యాశాఖాధికారులు ఏర్పాటు చేశారు. ఈ విడత అందుకు భిన్నంగా ఇతర జిల్లాల్లో సైతం పరీక్షా కేంద్రాలను వేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img