Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అడ్వాణీకి భారతరత్న

. ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించిన మోదీ
. నాకు భావోద్వేగమైన క్షణమని ప్రధాని వెల్లడి
. ప్రముఖుల శుభాకాంక్షలు
. నా సేవలు, సిద్ధాంతాలకు గుర్తింపు: అడ్వాణీ

న్యూదిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అడ్వాణీకి ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని శనివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడిరచారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. ‘ఎల్‌కే అడ్వాణీజీకి భారతరత్న ప్రదానం చేయనున్న విషయాన్ని నేను పంచు కోవడం చాలా సంతోషంగా ఉంది. అడ్వాణీతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపాను. ఈ తరానికి చెందిన అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞుల్లో ఒకరైన ఆయన… భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయం. అట్ట డుగు స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి… ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. కేంద్ర హోంమంత్రిగా, సమాచార, ప్రసారశాఖ మంత్రిగా విశిష్టత చాటుకున్నారు. పార్లమెంటులో ఆయన అనుభవం మనకు ఆదర్శప్రాయం. అడ్వాణీజీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారు. ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా భావోద్వేగమైన క్షణం. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా’ అని ప్రధాని పేర్కొన్నారు. అడ్వాణీకి భారతరత్న ప్రకటించడంపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, ఇతర పార్టీల నేతలు సంతోషం వెలిబుచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, తాను దేశానికి చేసిన సేవలు, తన సిద్ధాంతాలకు గుర్తింపుగానే భారతరత్న లభించిందని, దీనిని సగర్వంగా స్వీకరిస్తున్నానని అడ్వాణీ పేర్కొన్నారు.
కాగా, అడ్వాణీ 1927 నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. అక్కడే సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. 1941లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో గల డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక య్యారు. 1976లో గుజరాత్‌ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977`80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్య సభలో కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా వ్యవ హరించారు. ఆ తర్వాత వాజ్‌పేయితో కలిసి 1980 ఏప్రిల్‌ 6న బీజేపీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అడ్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీనగర్‌ నుంచి గెలుపొందిన అడ్వాణీ… 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img