Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు. రిజర్వేషన్లను సమర్థించిన న్యాయస్థానం ఈబీఎస్‌ కోటా చెల్లుబాటు అవుతుందని వెల్లడిరచింది. మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో రిజర్వేషన్లను నలుగురు జడ్జిలు సమర్థించారు.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ త్రివేది, జస్టిస్‌ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img