Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఈవీఎంలే మోదీవిజయ రహస్యం

. అవి తారుమారు కాకుండా అరికట్టగలిగితే ‘400 పార్‌’ కల్ల
. మోదీ గద్దె దిగడం తథ్యం
. అందుకోసం మా వంతు కృషి చేస్తాం: యూపీలోని చోర్డిహా గ్రామ ప్రజలు

న్యూదిల్లీ : దేశంలో ఎన్నికల నగారా మోగింది. పోలింగ్‌ తేదీల ప్రకటన వెలువడిరది. బీజేపీ మూడోసారి అధికారం కోసం తంటాలు పడుతోంది. ‘400 పార్‌’(400 సీట్లు) నినాదంతో ముందుకెళుతోంది. అయితే బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామం… కమల దళానికి చుక్కలు చూపించేందుకు సిద్ధమైంది. 400కు మించి స్థానాల్లో గెలవాలనే బీజేపీ ఆశలు గల్లంతు చేయాల్సిందేనని నొక్కిచెబుతోంది. మోదీని గద్దె దించితేనే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతోంది. అదే ఉత్తరప్రదేశ్‌, సాలంపూర్‌ పార్లమెంటరీ నియోజకర్గం పరిధిలోని దళిత గ్రామం చోర్డిహా. ఇక్కడి ప్రజలు మోదీపై గుర్రుగా ఉన్నారు. ఆయనను ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలని భావిస్తు న్నారు. ఈవీఎంలే మోదీ విజయ రహస్యమని, ఈవీఎంలు తారుమారు కాకుండా అరికట్టగలిగితే బీజేపీ ‘400 పార్‌’ కల సాకారం కాబోదని, మోదీ గద్దె దిగడం తథ్యమని, అందుకోసం తమ వంతు కృషి చేస్తామని అంటున్నారు. బీజేపీ మంత్రాంగానికి చెక్‌ పెట్టేందుకు సంకల్పించారు.
‘పోలింగ్‌ రోజు మా బూత్‌లకు వస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈవీఎంలే మోదీ విజయ రహస్యం. మాలో ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వేయరు. కానీ ఫలితాలు పూర్తి భిన్నంగా వెలువడతాయి. పోలింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడం వ్యర్థం. వారు కూడా బీజేపీ తొత్తులే’ అని గ్రామ ప్రజలు అన్నారు. మధ్యాహ్నం 12గంటల లోపు ఓటు వేస్తే వాటిని తారుమారు చేసే అవకాశం ఉండదని ఒకరు చెప్పగా…అలాగే చేసిచూద్దామని మిగతావారన్నారు. ‘మధ్యాహ్నం 12 గంటల్లోగా ఓట్లు వేద్దాం. ఆ తర్వాత ఈవీఎంలను సీల్‌ చేసి వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించమని ప్రిసైడిరగ్‌ అధికారులను కోరుదాం’ అని స్థానికుడు సీతారాం అన్నారు. పోలింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా అధికారులు పొద్దుపోయే వరకు పోలింగ్‌ కేంద్రాల్లో ఎందుకు ఉండాలి? ఆ సమయంలో ఈవీఎంలు తారుమారవుతాయన్నారు. ఈవీఎంలకు సీల్‌ వేసి… వాటిని ప్యాక్‌ చేసేంత వరకు బూత్‌ వద్ద నుంచి కదలకూడదని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు. మోదీపై వీరి కోపానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ ‘మీకు ఇక్కడి పరిస్థితులు ఏమి తెలుస్తాయి. మీరు బయట నుంచి వస్తారు. అవాస్తవాల ఆధారంగా ప్రశ్నలు వేస్తారు. పక్కనే పాట్నా గ్రామానికి చెందిన ఓ యువకుడు మంచి జానపద గాయకుడు. ఓ పాట పాడి యూట్యూబ్‌లో పెట్టాడు. వెంటనే అతనిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పోలీసులు తరచూ వచ్చి జానపద గాయకుల కోసం వెతుకుతుంటారు’ అని అన్నారు. పోలీసు యంత్రాంగం యోగి ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కదా… అంటే యోగి ఉండేది మోదీ కిందే కదా అని వారు అన్నారు. మోదీ పనైపోతే యోగి కూడా ఉండరన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ మోదీ తప్ప ఎవరి గురించి ఆలోచించాల్సిన పనిలేదని నొక్కిచెప్పారు. ఎన్నికల బాండ్ల వివాదం, సుప్రీంకోర్టు తీర్పు గురించీ వీరికి తెలుసు. మోదీని గద్దె దించితే తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించబోదని నమ్మకంగా చెప్పారు. ‘సొంత మనుషుల ద్వారా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మోదీ స్వాధీనం చేసుకున్నారు. రఘురామ్‌ రాజన్‌ను తొలగించి…తన వారిని బ్యాంకుల్లో నియమించారు. జాతీయస్థాయిలో జరిగే అన్ని పరిణామాలు మాకు తెలుసు. మొబైల్‌ ఫోన్ల ద్వారా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాలలో దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంటాం’ అని వారు చెప్పారు. మోదీకి కాకపోతే ఎవరికి ఓటు వేస్తారంటే మాయావతి పేరు చెప్పారు. కాంగ్రెస్‌`సమాజ్‌వాదీ పార్టీ కూటమితో కలిసి ఆమె ఎన్నికలకు వెళతారని ఆకాంక్షించారు. సమయం చాలా ఉన్నది కాబట్టి పొత్తుల్లో మార్పులు జరగవచ్చన్నారు. ఏదిఏమైనా తమ ఆందోళన మొత్తం ఈవీఎంలపైనే అని అన్నారు. మోదీని గద్దె దించేందుకు ఇవొక్కటే మార్గమని స్థానికులు నొక్కిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img