Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కర్ణాటకలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్‌..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
మళ్లీ పలు వైరస్‌లు చెలరేగుతున్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కాగా కర్ణాటకలో జికా వైరస్‌ కలకలం రేగింది. రాష్ట్రంలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్‌ ఉన్నట్టు తేలింది. రాయచూర్‌ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్‌ సోకినట్టు తెలిసింది. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైంది. డెంగ్యూ, చికెన్‌ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్‌లు చేయించారు. డాక్టర్లు పాప సీరమ్‌ శాంపిల్స్‌తో పాటు మరో ఇద్దరివి సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ పరీక్షల్లో పాపకు జికా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఇద్దరికి నెగిటివ్‌ అనే తేలింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఇది మొదటి కేసు. ప్రభుత్వం పరిస్థితిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని.. దీనిని నిర్వహించడానికి తమ డిపార్ట్‌మెంట్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే దీనికి సంబంధించి అందరికి హెచ్చరికలు జారీ చేశామని మంత్రి తెలిపారు. ఏదైనా ఆస్పత్రుల్లో అనుమానాస్పద ఇన్‌ఫెక్షన్‌ కేసులు కనిపిస్తే జికా వైరస్‌ పరీక్షల కోసం నమూనాలను పంపించాలని రాయచూర్‌, పొరుగు జిల్లాల్లోని నిఘా (ఆరోగ్య శాఖ) అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చామన్నారు. కాగా కొన్ని నెలల క్రితం కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కర్ణాకటలో వెలుగు చూడడం ఆందోళనకరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img