Friday, May 3, 2024
Friday, May 3, 2024

చట్టసభల్లో అడుగు పెట్టేలా ఉధృత ఉద్యమాలు

. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి
. దేశంలో ప్రమాదకర రాజకీయాలు
. కార్యదర్శి నివేదిక ప్రవేశపెడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో` విశాఖపట్నం: కమ్యూనిస్టులు చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 27వ మహాసభలు రెండో రోజు ప్రతినిధుల సభలో రామకృష్ణ కార్యదర్శి నివేదికను ప్రవేశపెడుతూ, దేశంలో ప్రమాదకర రాజకీయాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం బాగుండాలంటే చట్టసభల్లోకి కమ్యూనిస్టులు వెళ్లాలని, ఆ వైపుగా మన ఉద్యమాలు ఉండాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను బీజేపీ నిస్సిగ్గుగా అమలు చేస్తున్నదన్నారు. దీంతో మతతత్వ రాజకీయాలు పెరిగాయనీ, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ వ్యక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. సంక్షేమాన్ని పక్కదారి పట్టించడానికి ఉచితాలంటూ కోర్టుకెళ్లిన బీజేపీ నాయకుడు…10 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేది కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 14నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు. పదివేల మంది రెడ్‌షర్ట్‌ వలంటీర్లు, వేలాదిమంది కళాకారులు, కార్యకర్తలతో మహా ప్రదర్శనకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతం ద్వారా దేశ రాజకీయాల్లో మార్పు రావాలన్నారు. జాతీయ మహాసభలు దేశ రాజకీయాలకు దిక్సూచిగా మారాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img