Friday, May 3, 2024
Friday, May 3, 2024

తలసరి ఆదాయంపై ధరల ప్రభావం

కరోనా ముందునాటికన్నా తక్కువగా నమోదు
అధికారిక గణాంకాలు వెల్లడి

న్యూదిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, హద్దూ, అదుపులేకుండా పెరుగుతున్న ధరల కారణంగా భారత తలసరి ఆదాయం తగ్గింది. 202122 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం కరోనా ముందునాటికన్నా కూడా తక్కువగా నమోదైందని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు తెలిపాయి. 202122 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.91,481గా ఉంది. జాతీయ నికర ఆదాయం (ఎన్‌ఎన్‌ఐ) ఆధారిత తలసరి ఆదాయం 2022లో 7.5శాతం మేర పెరిగింది. 201920లో రూ.94,270గా ఉంటే అది 202021లో రూ.85,110కు తగ్గిపోయింది. ప్రస్తుత ధరల ప్రకారం 202122 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 18.3శాతం పెరిగి రూ.1.5లక్షలకు చేరింది. అదే 202021లో రూ.1.27 లక్షలుగా, 2019`20లో రూ.1.32 లక్షలుగా నమోదు అయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img