Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈసారి ఎన్నికలు ఏకపక్షమే !

వైసీపీపై ఉన్నంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా లేదు
పార్టీలో గ్రూపులకు చెక్‌ ` మినహాయింపులు లేవు
టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో ఉన్నంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా లేదని, ఈసారి ఎన్నికలు ఏక పక్షమేనన్నారు. చంద్రబాబు మంగళవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహానాడు విజయం, సభ్యత్వ నమోదు, జిల్లాల పర్యటనలు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై మాట్లాడారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం అందుబాటు లోకి తెచ్చిన న్యూట్రిఫుల్‌ యాప్‌ గురించీ ప్రస్తావించారు. మూడేళ్ల ప్రభుత్వ అణిచివేత ధోరణితో కార్యకర్తల్లో ఉన్న కసి, పాలకుల నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజల అసం తృప్తే మహానాడు విజయానికి కారణమని చంద్రబాబు తెలిపారు. వాహన సౌకర్యం లేకుండా ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేశారన్నారు. సొంతంగా ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో జనం రావడం రాష్ట్రంలో రాజకీయంగా వచ్చిన మార్పుకు నిదర్శనమన్నారు. మండువవారి పాలెం రైతులు భూమలు ఇచ్చి సహకరించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒంగోలు నేతల సమష్టి కృషితో మహానాడు విజయవంతం అయిందని, వారి నుంచి అన్ని జిల్లాల నేతలు స్ఫూర్తి పొందాలన్నారు. వైసీపీ బస్సుయాత్ర జనంలేక వెలవెలపోతే, మహానాడుకు జనం తరలిరావడం టీడీపీపై నమ్మకాన్ని చాటుతోందన్నారు. టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగించాలని, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ కమిటీల నియామకం పైనా నేతలకు దిశానిర్ధేశం చేశారు. గ్రామ స్థాయి వరకు పెండిరగ్‌లో ఉన్న కమిటీల నియామకం పూర్తి చేయాలని, పార్టీలో గ్రూపులను సహించేది లేదని చంద్రబాబు తెలిపారు. గ్రూపులను అరికట్టాలని, అలాంటివాటికి పాల్పడితే ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని తేల్చిచెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img