Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

నేటి నుంచి బడులు

కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు తప్పనిసరి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 202122 విద్యా సంవత్సరానికిగాను పూర్తిగా కరోనా నిబంధనల నడుమ పాఠశాలలు తెరవనున్నారు. నాడు- నేడు కార్యక్రమలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేశారు. అన్ని జిల్లాల్లోనూ అవి సుందరంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పించారు. ఇప్పటికే తరగతుల నిర్వహణపై విద్యాశాఖ సూచనలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకుంటారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి పాఠశాలకు మెరుగైన సౌకర్యాలు ఉండాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించే బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. పాఠశాలల పున:ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని..ఉపాధ్యాయులకు కరోనా టీకా వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చాలా మందికి ఆ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి వేయించేలా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. చాలాకాలం తర్వాత పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img