Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పార్లమెంట్‌ ఉభయసభలు 2 గంటల వరకు వాయిదా

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌పై హిండెన్‌బర్గ్‌ రీసర్చ్‌ సంస్థ ఇచ్చిన నివేదికను చర్చించాలని ఇవాళ విపక్షాలు పార్లమెంట్‌లో డిమాండ్‌ చేశాయి. లోక్‌సభ, రాజ్యసభలోనూ బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే ఇవాళ లోక్‌సభ సమావేశం అయిన తర్వాత .. విపక్షాలు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆ అంశంపై చర్చను చేపట్టాలని కోరాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే సీన్‌ రిపీటైంది. సభ్యులు సభా మర్యాదలను పాటించాలని చైర్మెన్‌ ధన్‌కర్‌ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం రెండు గంటలకు వరకు వాయిదావేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img