Monday, May 6, 2024
Monday, May 6, 2024

పులుల్లా బతకండి: పవన్ కల్యాణ్

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్పూర్తిదాయకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ః నేను.. నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే గొప్పదిః అని అంబేద్కర్ చెప్పారని… ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరని అన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అంబేద్కర్ అందించారని కొనియాడారు. మన దేశం, మన ప్రజలు సమైక్యంగా, సమున్నతంగా, శక్తిమంతంగా, సమభావంగా ముందుకు సాగడానికి రాజ్యాంగం ద్వారా పద నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అంబేద్కర్ లాంటి మహా జ్ఞానులు కోటి మందికి ఒక్కరే ఉంటారని చెప్పారు. మేకలను బలి ఇస్తారని, పులులను బలి ఇవ్వరని… అందుకే అందరూ పులుల్లా బతకాలని చెపుతూ అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని అంబేద్కర్ పెంచారని పవన్ తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పిస్తున్నాని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img