Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మూడో డోసు కూడా తీసుకోవచ్చు

సీరం సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా
కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ మూడో డోసు కూడా తీసుకోవచ్చునని సీరం సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా చెప్పారు. ఆరు నెలల తరువాత శరీరంలో యాంటీ బాడీలు తగ్గిపోతాయని, అందువల్ల రెండు డోసుల అనంతరం 6 నెలల గ్యాప్‌ ఇచ్చి మూడో డోసు తీసుకోవచ్చునన్నారు. తమ కంపెనీలోని ఏడెనిమిదివేల మంది ఉద్యోగులు మూడో డోసు కూడా తీసుకున్నారని, తాను కూడా మూడవ డోసు తీసుకున్నట్టు చెప్పారు.రెండు డోసుల మధ్య విరామ కాలం రెండు నెలలు ఉండాలి.. కానీ వ్యాక్సిన్‌ కొరత దృష్ట్యా కేంద్రం దీన్ని మూడు నెలలకు పొడిగించింది అని ఆయన వివరించారు.దేశంలోని జనాభా అంతటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయగలుగుతామన్న కేంద్రం ప్రకటనను పూనావాలా కొట్టిపారేశారు. తమ కంపెనీ నెలకు 10 కోట్ల డోసుల టీకామందును ఉత్పత్తి చేస్తుందని..నిజానికి ఇంత హెచ్చుగా ప్రొడ్యూస్‌ చేయడం సులభం కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img