Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌

ఉపాధి హామీ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు
ఉత్తర్వులు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిక
నాలుగు వారాల్లో 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలి
20 శాతం మేర బిల్లుల తగ్గింపు జీవో కొట్టివేత

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరిం చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. వైసీపీ హయాంలో జరిగిన పనులకు మాత్రం యథావిధిగా బిల్లులు చెల్లిస్తోంది. దీన్ని హైకోర్టులో కాంట్రాక్టర్లు సవాల్‌ చేశారు. దాదాపు దీనిపై 1,013 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఇదేం పద్ధతి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయని కొన్నాళ్లు, విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని మరికొన్నాళ్లు ఆలస్యం చేస్తూ వచ్చారు. హైకోర్టు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా, అధికారులను హైకోర్టుకు రప్పించినా ప్రభుత్వం మాత్రం తీరుమార్చుకోలేదు. దీంతో హైకోర్టు మంగళవారం ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసి కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో పెండిరగ్‌ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం తగ్గించి చెల్లిస్తామన్న ప్రభుత్వ జీవోను ధర్మాసనం కొట్టివేసింది. బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తర్వులు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
నరేగా బిల్లులపై కోర్టు తీర్పు హర్షణీయం : వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌
ఉపాధి బిల్లుల బకాయిలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. పనులు చేసిన వారికి ఎలాంటి కోతలు లేకుండా, ఆలస్యమైన కాలానికి నరేగా నిబంధనల ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమన్నారు. అధికారులు ఇప్పటికైనా వైసీపీ నాయకుల ఆదేశాలను కాకుండా న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని, తక్షణమే పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img