Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కాషాయ కూటమిపై పోరుకు కలిసిరండి

లౌకిక, ప్రజాస్వామిక శక్తులకు సీపీఐ పిలుపు

11 వరకు ‘లఖింపూర్‌’ నిరసన
నవంబరు 7న అక్టోబరు విప్లవ దినోత్సవం
సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు సైద్ధాంతిక ప్రచారం
వినాశకర సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌

న్యూదిల్లీ : బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా సైద్ధాంతిక, రాజకీయ ప్రచారాన్ని అన్ని స్థాయిల్లోనూ ముమ్మరం చేయాలని పార్టీ శాఖలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి పిలుపునిచ్చింది. కాషాయ కూటమిపౖౖె పోరునకు కలిసి రావాలని లౌకిక ప్రజాస్వామిక శక్తులకు పిలుపునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల హత్యాకాండకు నిరసనగా ఈనెల 11వ తేదీ వరకు ఆందోళనలు కొనసాగించాలనిÑ కారకులైన కేంద్రమంత్రి, ఆయన తనయుడి అరెస్టు, ఉన్నతస్థాయి జ్యుడిషియల్‌ విచారణ నిర్వహించాలని, మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని జాతీయ సమితి డిమాండు చేసింది. అక్టోబరు విప్లవం స్ఫూర్తితో నవంబరు 7న పార్టీ శాఖలన్నీ విప్లవ దినోత్సవాన్ని పాటించాలని సూచించింది. ఈనెల 2,3,4 తేదీల్లో న్యూదిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్‌ భవన్‌లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరిగాయి. చివరి రోజున రాజకీయ, ఆర్థిక పరిణామాలు, భవిష్యత్‌ కార్యక్రమాల ప్రతిపాదనలు, వ్యవస్థాగత కార్యకలాపాలపై ముసాయిదా తీర్మానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రవేశపెట్టారు. చర్చల తర్వాత తీసుకున్న నిర్ణయాలను మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వెల్లడిరచారు. ప్రభుత్వ రంగ వ్యవస్థల ప్రైవేటీకరణ, పెరుగుతున్న నిరుద్యోగం, ప్రజల వెతలు, కష్టాలు, పెట్రో ధరలు, మహిళలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలపై పేట్రేగిపోతున్న దురాగతాలు, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై సమావేశం చర్చించింది. రాజ్యాంగం, సామాజిక న్యాయం పరిరక్షణకు బహుమార్గాల్లో రాజకీయసైద్ధాంతిక ప్రచారాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రచారం నవంబరు 26 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, గోవా రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ అజెండాకు, రాజ్యాంగ ఉల్లంఘనలకు, ప్రాథమిక హక్కుల హరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముమ్మరం చేయాలని కూడా నిర్ణయించిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉందని, మోదీ ప్రభుత్వం క్రోనీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు దాసోహం అయి దేశాన్ని వారికి దోచి పెట్టేస్తున్నట్లు దుయ్యబట్టారు. నిజమైన సంపద సృష్టికర్తలైన శ్రామికులు, రైతుల బతుకులను దుర్భరం చేస్తోంది. వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టివేస్తోంది. ఇటీవల మానటరీ పైప్‌పైల్‌ విధానాన్ని ప్రకటించి తద్వారా రూ.6లక్షల40వేలకోట్లు సేకరిస్తామని చెప్పింది. అంటే ప్రభుత్వ ఆస్తులను, వనరులను ప్రైవేటుకు ధారాదత్తం చేయడమే. ఇలాంటి ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాజద్రోహం వంటి కాలం చెల్లినచట్టాలను అడ్డంపెట్టుకొని భావప్రకటన స్వేచ్ఛను హరించడం, దాడులకు తెగబడటం ఇటీవల పెరిగిందని సమావేశం పేర్కొన్నది. మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలపై నేరాలు పేట్రేగిపోవడం వల్ల సామాజిక ఘర్షణలు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది.ఈ పరిస్థితులు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నట్లు సీపీఐ పేర్కొంది. లఖింపూర్‌ ఖేరి ఘటనపై, మణిపూర్‌ పరిణామాలపై, జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌పై, జాతీయ మోనటైజేషన్‌ విధానం`ప్రైవేటీకరణపై అనేక తీర్మానాలను జాతీయ సమితి చేసింది. సమావేశానికి మాజీ ఎంపీ, బీకేఎంయూ నాయకులు నాగేంద్రనాథ్‌ ఓరaా, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతవహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img