Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

విశాలాంధ్ర`గుంటూరు : ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని విద్యార్థులందరూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉర్దూ పాఠశాల ఉప తనిఖీ అధికారి ఎస్‌.కె యండీ ఖాసిం అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లను స్థానిక ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పాఠశాల అభివృద్ధి కోసం మౌలిక వసతులు, విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ విద్యార్థులకు అవసరమైన స్కూల్‌ బ్యాగ్‌, యూనిఫామ్స్‌, బెల్ట్‌, షూస్‌, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో సహా జగనన్న విద్యా కిట్ల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలని, ఉపాధ్యాయులు కూడా ఇదేవిధంగా కరోనా నిబంధనలు పాటించి విధులకు హాజరుకావాలని కోరారు. పంపిణీ చేసిన వస్తువుల్లో ఏమైనా నాణ్యతా లోపాలుంటే వెంటనే ప్రధానోపాధ్యాయిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని కరిమున్నీసా, ఉపాధ్యాయులు రాబియా బసిరి, హస్సన్‌ బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img