Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఫోర్టీ ఫైడ్ బియ్యం పై అపోహలొద్దు

. రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు 100% ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.
. జాతీయ ఆహార భద్రత కింద భారత ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను 8135 కోట్లకు పైగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది.
. భారత ఆహార సంస్థ ప్రజా పంపిణీ పోషకాహార లోప నివారణకు చర్యలు తీసుకుంది
.

ఎఫ్ సి ఐ, డి.జి.ఎం.జయప్రసాద్

విశాలాంధ్ర – తాడేపల్లి : ఫోర్టీ ఫైడ్ బియ్యం పై అపోహలు వద్దని ఎఫ్సీఐ డీజీఎం జయప్రసాద్ అన్నారు. భారత వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణి మంత్రత్వశాఖ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తాడేపల్లి కృష్ణ కెనాల్ జంక్షన్ఫు డ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎఫ్సీఐ మేనేజర్ సుకుమార్, మేనేజర్ క్యూ సి ఎం.ఎస్ శశికళ, ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీఎం జయప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని భారత ఆహార సంస్థ స్థానిక రాష్ట్రప్రభుత్వాలు విజయవంతముగా అమలు పరుస్తున్నాయని తెలిపారు. రానున్న సంవత్సరానికిరెండు లక్షల కోట్లకు పైగా భారత ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.జాతీయ ఆహార భద్రతా కింద భారత ప్రభుత్వం ఉచిత ఆహార ధాన్యాలను 8135 కోట్లకు పైగా లబ్దిదారులకు పంపిణి చేయటం జరుగుతుందని తెలిపారు.ఈ చట్టం కింద ప్రాధాన్య లబ్దిదారు కుటుంబసభ్యునికి 5 కేజీల ఆహార ధాన్యాలను మరియు నీరు పేదకుటుంబాలకు 35 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను పూర్తిగా ఉచితంగా పంపిణి చేయటం జరుగుతుందని తెలిపారు.గతంలో బియ్యానికి కిలో కి 3 రూపాయలు,గోధుమలు కిలో కి 2 రూపాయలు తీసుకోవటం జరిగిందని కానీ మార్చ్ 2023 నుంచి ఆహార ధాన్యాలను పూర్తి ఉచితంగా పంపిణి చేయబడుతుందని పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను అధిగమించడానికి భారత ప్రభుత్వం ఫోర్టీఫైడ్ బియ్యంన్ని పీఎం పోషణ,ఐసిడిఎస్,ఇతర సంక్షేమ కార్యక్రమాలద్వారా పంపిణి చేయడానికి అనుమతించిందని. తెలిపారు.మొదటగా పైలట్ ప్రజెక్ట్ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం లోప్రారంభించడం జరిగిందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం ఫోర్టిఫైడ్ బియ్యం కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఫోర్టీ ఫైడ్ బియ్యం వినియోగం గురించి అవగాహన కొరకు ఐ ఈ సి (సమాచారం, విద్య మరియు తెలుపుట) కార్యక్రమాలను వివిధ దశలుగా అంగన్వాడీ, విద్యాసంస్థలు,రెవిన్యూ జిల్లాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అండమాన్ నికోబార్ దీవులతో కలిపి మొత్తం 24 గోదాములు నిల్వల సామర్థ్యం పునఃపరిశీలనకు ముందు 700466 ఎంటి ఎస్ పెంచిన తరువాత 871082 ఎంటి ఎస్ గా ఉందని ఈ 24 గోదాములకుగాను 21 గోదాములను డబ్ల్యూ డి ఆర్ ఏ పరిశీలన చేసి ధ్రువీకరించారని అన్నారు.మిగతా గోదాముల పరిశీలన పెండింగ్ లో ఉందని నవీకరణ తరువాత 11 గోదాములకు క్యూ సి ఐ 5+ స్టార్ రేటింగ్13 గోదాములకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.అనంతరం ఎఫ్సిఐ గోడౌన్ లోని స్టాక్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిషనల్ మేనేజర్ దుశ్యంత్,ఏజీఎం మనోజ్ కుమార్,మేనేజర్ క్యూసి ఈ.రాంప్రసాద్,ఏలూరు ఎఫ్సిఐ మేనేజర్ రగల్ కిరణ్, ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ మెంబర్ దానబోయిన సుందరరావు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img