Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఆత్మకూరులో ‘జంగాల’ ఇంటింటి ప్రచారం

విశాలాంధ్ర`మంగళగిరి : ఇండియా కూటమి బలపర్చిన గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌ కుమార్‌ ఆదివారం ఉదయం మంగళగిరి మండ లం ఆత్మకూరులో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఆయ నకు అపూర్వ స్వాగతం లభించింది. జంగాల మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఒకపక్క రాష్ట్రంలో అధికార వైసీపీ, టీడీపీ కొట్లాడుకుంటూ మరోపక్క నియం తృత్వ మోదీకి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే దేశంలో, రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమి బలపర్చిన గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థిగా తనకు కంకి కొడవలి గుర్తుపై, సీపీఎం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్‌కు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జొన్నా శివశంకర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ముందుండి పోరాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆట పాటలతో ఓటర్లను చైతన్యపర్చారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలారి జాన్‌ బాబు, చిన్ని సత్యనారాయణ, కాబోతు ఈశ్వరరావు, పంతగాని మరియదాసు, బి.శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షులు జాలాది నవీన్‌, గజబల్లి వెంకటకృష్ణారావు, గోలి సాంబశివరావు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, జాలాది విజయేంద్ర రావు, జాలాది జయరాజ్‌, మణికంఠ, పంచల నాగేశ్వరరావు, గోలి రామకోటి, జాలాది ఏసుపాదం, సీపీఐ జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నాయకులు ముసలి ఫకీరయ్య, ముసలి జ్యోతిబసు, కొలనుకొండ శివరామకృష్ణయ్య, పి.ప్రసాద్‌, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
తాడికొండలో… జంగాల అజయ్‌ కుమార్‌ తాడికొండలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హోటళ్లు, టీ స్టాళ్లు, మటన్‌, చికెన్‌ స్టాళ్లు, మెకానిక్‌ షెడ్లు, వ్యాపార దుకాణాలు తదితర చోట్ల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మతోన్మాద బీజేపీతో టీడీపీ, జనసేన ఏకంగా పొత్తుపెట్టుకోగా, అధికార వైసీపీ రహస్యంగా కుమ్మక్కైందని దుయ్యబట్టారు. కంకి… కొడవలి గుర్తుపై ఓటు వేసి గుంటూరు ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జె.చైతన్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్‌ కుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నాసర్‌ జీ, సీపీఐ జిల్లా ఉపాధ్యక్షులు బైరాపట్నం రామకృష్ణ, జిల్లా నాయకులు శరణం విజయ్‌, తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్‌ రావు, పార్టీ నాయకులు రేపూడి శ్రీనివాసరావు, గుర్రంకొండ సత్యానందం, ఖమ్మంపాడు దేవుని దయ, కె.చెన్నకేశవులు, నండూరి జోజి, సొంగ రాయప్ప, బండి సాంబయ్య, సీపీఎం నాయకులు చింతల భాస్కరరావు, కె.పూర్ణచంద్రరావు, బాణావత్‌ భద్రయ్య, జోజి, ప్రసాద్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img