Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలే, మరల ప్రజలు వై.సి.పి.కి పట్టం కడతారు

స్పీకర్ తమ్మినేని

విశాలాంధ్ర – వినుకొండ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలన్నీ 99% అమలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఎన్నికలు ఎప్పుడు పెట్టిన 175 స్థానాలతో ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారని. ఏపీ శాసనసభ స్పీకర్. తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆయన కుటుంబ సభ్యు లతో. దైవ దర్శనార్థం శ్రీశైలం వెళుతూ. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వినుకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని. ఎన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని తికమక పెట్టి.  అవ గాహన లేకుండా మాట్లాడుతున్నారని. స్పీకర్ అన్నారు. గడపగడప కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చి. సంక్షేమ పథకాలతో. ఎంత ఉత్సాహంగా ఉన్నారని. తెల్లవారుజామునే కోడి కూయగానే పెన్షన్ డబ్బులు అర్హుల చేతిలో పడుతున్నాయని ఆయన అన్నారు. టిడిపి హయాంలో జన్మభూమిలో జరిగిన దోపిడీ లాగా నేడు పాలనలేదని సచివాలయ ఉద్యోగులు. వార్డు వాలంటీర్లు ఎంతో సమర్థవంతంగా పైసా ఆశించకుండా సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరుస్తున్నారని అన్నారు. చుక్కల భూములు. సమగ్ర భూ సర్వే అగ్రహారం భూములు. ఆ రైతులకే చెందే విధంగా ఈ పథకం ఎంతో మేలు చేకూరుస్తుందని దేశంలో ఎక్కడా ఈ భూ సర్వే కార్యక్రమం జరగడం లేదని ఆయన అన్నారు. ఇక ప్రతి ఇంటికి డాక్టర్ వచ్చి వైద్యం చేసే విధంగా కార్యాచరణ ప్రభుత్వం రూపొందిస్తుందని. రాష్ట్రంలో పేదరికం పోవాలి. పేదరికంతో ఏ వ్యక్తి చనిపోకూడదు అన్న తపన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదిలో ఉందని. వారి కోసమే ఆయన తపిస్తున్నారని అన్నారు. పేదరికం,  విద్య. సేద్యానికి. అడ్డు ఉండకూడదని ముఖ్యమంత్రి తపిస్తున్నారని అన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు హై స్కూల్స్. కార్పొరేట్ స్థాయిలో మెరుగులు దిద్దుకున్నాయని అన్నారు. అమ్మ ఒడి. జగనన్న గోరుముద్ద. వంటి పథకాలు ప్రజల్ని మరింత ప్రభుత్వం వద్దకు చేర్చిందని. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయరని ఆయా ముఖ్యమంత్రి లను. ప్రధాని మోడీ ప్రశ్నిస్తున్నారని స్పీకర్ తమ్మినేని ఈ సందర్భంగా అన్నారు. గడపగడపకు వచ్చిన కొద్దిపాటి స్పందనకు. జగనన్నకు చెబుదాం స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమానికి స్పందన లేకుండా పోయిందని ప్రశ్నించగా. స్టిక్కర్ల కొరత కారణంగా కొంత జాప్యం జరిగిందని తిరిగి మరల ప్రారంభించనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం సర్ది చెప్పుకున్నారు. అలాగే  వినుకొండ కొండ పై నిర్మిస్తున్న రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన నిర్మాణం కు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు  చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అలాగే దేవస్థానం కు నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిసింది, ప్రభుత్వం ద్వారా ఘాట్ రోడ్డు నిర్మాణానికి మరియు దేవస్థాన నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img