Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

వ్యర్థాల నుంచే విలువైన ఉత్పత్తులు

విశాలాంధ్ర`గుంటూరు : పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాల రీసైక్లింగ్‌ వలన వాతావరణ కాలుష్యం అరికట్టడమే కాకుండా వాటి నుంచి విలువైన ఉత్పత్తులను తయారుచేయవచ్చునని భోపాల్‌లోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫారెస్ట్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ అడిషనల్‌ డైరక్టర్‌, సైంటిస్ట్‌ డాక్టర్‌ హెచ్‌వీసీ చారీ గుంటుపల్లి అన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘సర్కులర్‌ బయో ఎకానమీ అండ్‌ బయోఇంజినీరింగ్‌ అప్రోచెస్‌ ఫర్‌ ఏ క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ సోమవారం ఘనంగా ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ హెచ్‌వీసీ చారీ గుంటుపల్లి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం సహజ వనరుల వినియోగం మీదే ఆధారపడి ఉందన్నారు. సహజవనరుల అధిక వినియోగం వలన ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నాయో… అదే సమయంలో వాతావరణంలో పారిశ్రామిక వ్యర్థాలు కూడా అంతే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దీనివలన సమాజంలో అనేక కొత్త అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. బయో హైడ్రోజన్‌, బయో ప్లాస్టిక్స్‌, మాలిక్యూల్స్‌ మొదలగు ఉత్పత్తుల ద్వారా సహజవనరుల అధిక వినియోగం నివారించి స్థిరమైన ఆర్ధికాభివృద్ధికి, భవిష్యత్‌ తరాలకు సహజవనరులను అందించవచ్చన్నారు. గుజరాత్‌లోని ఇంజ్యూనిటీ బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో డాక్టర్‌ కె.రవి మాట్లాడుతూ అధునాతన సాంకతిక పరిజ్ఞానంతో బయోమాలిక్యూల్స్‌ అనాలిసిస్‌కు బయోటెక్నాలజీ పరిశ్రమలలో అత్యధిక అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.నాగభూషన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img