Friday, December 2, 2022
Friday, December 2, 2022

అల్జీరియాలో కార్చిచ్చు.. 25 మంది సైనికుల మృతి

అల్జీరియా : ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా అటవీప్రాంతంలో మంటలు చెలరేగ డంతో 25 మంది సైనికులతో సహా 42 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆదేశ అధ్యక్షుడు ధృవీకరించారు. అల్జీరియా రాజధానికి తూర్పున ఉన్న పర్వతప్రాంతాల్లోని అడవులు, గ్రామాలను ధ్వంసం చేస్తున్న అడవి మంటల నుండి నివాసితులను కాపాడేక్రమంలో కనీసం 25 మంది అల్జీరియన్‌ సైనికులు మరణించారు. మంటల కారణంగాఎగిసిన పొగలతో ఊపి రాడక డజన్లమంది మరణిం చారు. బెర్బర్స్‌ పర్వతం, కబైలియా ప్రాంతంలో మం టలు వ్యాపించగా.. సుమారు వందమంది పౌరులను కాపాడినట్లు ఆర్మీ ట్వీట్‌ చేసింది. కబైలియా ప్రాం తంలో జీవనోపాధికి అధార మైన ఆలివ్‌ చెట్లు కాలిపోగా.. పశువులు కూడా మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలనుఅదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులకు పరిహారం ఇవ్వ నున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రినుండి 13 ప్రావిన్స్‌లలో కార్చిచ్చుకు అడవులు బూడిదవుతున్నాయి. బొగ్గు, చమురు వంటి సహజవాయువుల దహనం నుండి వెలువడే విషవాయువులు వాతావరణ మార్పుకు వేడి గాలులు, కరవు, వరదలు, తుఫానులు వంటి విపరీత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img