Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఇండోనేషియాలో 41మంది అగ్నికి ఆహుతి

జకర్తా : ఇండోనేషియా రాజధాని జకర్తా జైలులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జకర్తాకు వెలుపల టాంగరింగ్‌ జైలులో జరిగిన ఈ ప్రమాదంలో 41మంది ఖైదీలు మరణించారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 72 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో దేశంలో తీవ్రం విషాదం నెలకొంది. రద్దీగా ఉండే ఇండోనేషియా జైలులో బుధవారం తెల్లవారుజామున 3గంటలకు మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికి ఆహుతయ్యారు. జైలులోని బ్లాక్‌ సీలో అగ్నిప్రమాదం సంభవించిందని భద్రతా అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించింది. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ జైలులోని ఈ బ్లాక్‌లో 40 మంది ఖైదీలు ఉండాల్సిఉండగా రెట్టింపు స్థాయిలో 122 మందికిపైగా ఉన్నారని తెలుస్తోంది. అయితే జైలులోఉన్న ఖైదీల సంఖ్య 2000మంది. ఇది మూడురెట్లు ఖైదీలు ఎక్కువగాఉన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో తప్పించుకోవడానికి అవకాశం లేనందున మృతుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img