ఏథెన్స్ : క్యూబాకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ కుతంత్రాలను గ్రీస్ కమ్యూనిస్టుపార్టీ (కేకేఈ) తీవ్రంగా ఖండిరచింది. క్యూబాకు వ్యతిరేకంగా మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్‌మీడియా, వెబ్సైట్లు వంటి వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా క్యూబాలో గందరగోళ పరిస్థితులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని కేకేఈ తిప్పికొట్టింది. క్యూబాపై కమ్యూనిస్టు వ్యతిరేక వ్యాఖ్యలను చేయడాన్ని కేకేఈ అధినేత కొస్టాస్ పాపాడకిస్ ఖండిరచారు. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ పార్లమెంటు ఉద్దేశపూర్వక క్యూబాకు వ్యతిరేకంగా ప్రచారాలు సరికావన్నారు. బైడెన్ ప్రభుత్వం 243 వస్తువులపై ఆంక్షలను విధించడం క్యూబన్ప్రజల కీలక అవసరాలు, మానవ హక్కులను హరించే విధానాలుగా ప్రస్తుతించారు. క్యూబా ప్రజలకు, ప్రభుత్వానికి, క్యూబా కమ్యూనిస్టుపార్టీకి మా పూర్తి సంఫీుభావం ఉంటుందని కేకేఈ ప్రకటించింది. ఈయూ పార్లమెంటు క్యూబాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడాన్ని గ్రీస్‌లోని ఆల్వర్కర్స్ మిలిటెంట్ఫ్రంట్ (పీఏఎమ్‌ఈ), గ్రీక్ కమిటీ ఫర్ ఇంటర్నేషనల్ స్టాప్ అండ్ పీస్, గ్రీక్`క్యూబన్ అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ సాలిడారిటీ తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ సందర్భంగా క్యూబాకు తమ సంఫీుభావానిÊ్న ప్రకటించింది.