Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జర్మనీతో మెరుగైన సంబంధాలకు జిన్‌పింగ్‌ పిలుపు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, జర్మనీ ఛాన్సలర్‌ మెర్కెల్‌ బుధవారం వీడియో లింక్‌ ద్వారా సమావేశమయ్యారు. చైనాజర్మనీ సంబంధాలు, చైనాఈయూ సంబంధాల వృద్ధిని రెండు దేశాల నాయకులు సమీక్షించారు. చైనాజర్మనీ, చైనాఈయూ సంబంధాల ప్రోత్సాహకానికి మెర్కెల్‌ సహకారాన్ని జిన్‌పింగ్‌ ప్రశంసిచారు. గత 16 సంవత్సరాలుగా చైనాజర్మనీ సంబంధాలలో అభివృద్ధిని కొనసాగించడంలో ముఖ్యమైన అనుభవనాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. చైనా పాత స్నేహితులను మరచిపోదని, మెర్కెల్‌కోసం ఎల్లప్పుడూ తలుపులు తెరచిఉంచుమని, చైనాజర్మనీ, చైనాఈయూ సంబంధాల అభివృద్ధికి మెర్కెల్‌ మద్దతు ఇస్తారని జిన్‌పింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాజర్మనీల అభివృద్ధి ప్రపంచ ఆర్థిక్యవస్థకు దోహదపడిరదని జి తెలిపారు. దౌత్య సంబంధాల స్థాపనకు 2022 సంవత్సరంలో 50వ వార్షికోత్సవంగా పేర్కొన్న జిన్‌పింగ్‌ సరైనమార్గంలో ద్వైపాక్షిక సంబంధాల కొనసాగింపు ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. చైనా`ఈయూ సంబంధాలను రెండు పక్షాలు విశాల దృక్పధంతోా చూడాలని ఒకరినొకరు నిష్పాక్షికంగా సమగ్రంగా అర్థం చేసుకోవాలని విభేదాలను శాంతియుతంగా, హేతుబద్ధంగా, నిర్మాణాత్మకంగా నిర్వహించాలని ఆన్నారు. మెర్కెల్‌ జర్మనీ చాన్సలర్‌గా ఉన్నకాలంలో చైనా వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. మెర్కెల్‌ మాట్లాడుతూ చైనాతో తమ సంబంధాలను స్వతంత్రంగా అభివృద్ధి చేసుకోవాలని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను జర్మనీ ప్రశంసిస్తోంది, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి చైనాతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రపంచ సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేస్తూనే ఉందని మెర్కెల్‌ అన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img