Friday, April 26, 2024
Friday, April 26, 2024

అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా చైనా నిధులు

బీజింగ్‌ : అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవవైవిధ్య రక్షణకు మద్దతగా 1.5 బిలియన్‌ యువాన్‌ (232.47 మిలియన్‌ డాలర్లు ) నిధిని ప్రారంభిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. చైనాలోని కున్మింగ్‌లో జరిగిన కాప్‌ 15 జీవవైవిధ్య శిఖరాగ్ర సమావేశంలో జిన్‌పింగ్‌ ప్రసంగించారు. మనిషి, ప్రకృతిల మధ్య సామరస్యపూర్వక సహజీవన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. దౌత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, పరిరక్షణ నిపుణులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రకృతి విధ్వంసాన్ని నివారించేందుకు తమ మద్దతు, సంఫీుభావం బలోపేతం చేయాలని జిన్‌పింగ్‌ సూచించారు. పేద దేశాలు పర్యావరణ రంగంలో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కోవిడ్‌`19 ప్రభావంతో ఆయా దేశాలు ఆర్ధికంగా క్షీణించాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచిమార్గంలో ప్రయోజనం పొందేందుకు వీలు కల్పించాలని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడంలో చైనా ఫలితాలను, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సహజ వనరుల వినియోగాన్ని విస్తరించాలని 2060 నాటికి కార్బన్‌ తటస్థను సాధించడం గురించి ఆయన ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దేశాల నుండి దాతలు ఈ విషయంలో సహకరించాలని అన్నారు. స్థిరమైన సరఫరా గొలుసు నిర్మాణానికి సంవత్సరానికి 1 ట్రిలియన్‌ డాలర్లు తీసుకుంటారని ఇతర మార్గాల్లో ప్రకృతిని రక్షించడానికి దేశాలు సహాయపడతారని అన్నారు. కున్మింగ్‌ బయోడైవర్సిటీ ఫండ్‌కు చైనా సహాకారం 1.5 బిలియన్‌ యువాన్‌లతో ప్రారంభమవుతుందని ఇతర పార్టీల సహకారాన్ని కూడా స్వాగతిస్తుం దని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. 230,000 చదరపు కిమీ భూభాగాన్ని నూతన జాతీయ ఉద్యానవన పథకాన్ని కూడా ప్రకటించారు. నూతన జీవ వైవిధ్య ఒప్పందం విజయవంతంకావాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు, సాంకేతికత, ప్రతిభను బదిలీ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img